ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik
ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. "మహా కుంభం ముగిసింది.. సమైక్య మహా యాగం ముగిసింది. 140 కోట్ల మంది దేశప్రజల విశ్వాసం 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఐక్యతా మహా కుంభానికి ఒక్కసారిగా వచ్చి ఈ ఒక్క పండుగలో చేరిన తీరు అఖండమైనది. మహా కుంభం పూర్తయిన తర్వాత నా మదిలో మెదిలిన ఆలోచనలను రాయడానికి ప్రయత్నించాను అని ప్రధాని మోడీ తన వెబ్ సైట్ లో కుంభమేళ గురించి రాసుకొచ్చిన విషయాల గురించి ట్వీట్ లో తెలిపారు.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదని ప్రధానమంత్రి అంగీకరించారు. భక్తులకు సేవ చేయడంలో ఏవైనా లోపాలు ఉంటే ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదని నాకు తెలుసు. నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నాను, ఓ తల్లి, మా ఆరాధనలో ఏదైనా లోపం ఉంటే, దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను భగవంతుని స్వరూపులుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే, నేను ప్రజల నుండి కూడా క్షమాపణ కోరుతున్నాను" అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో రాశారు. కాగా జనవరి 13న ప్రారంభం అయిన మహా కుంభమేళ ఫిబ్రవరి 26న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీనిని కుంభమేళ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు.
महाकुंभ संपन्न हुआ...एकता का महायज्ञ संपन्न हुआ। प्रयागराज में एकता के महाकुंभ में पूरे 45 दिनों तक जिस प्रकार 140 करोड़ देशवासियों की आस्था एक साथ, एक समय में इस एक पर्व से आकर जुड़ी, वो अभिभूत करता है! महाकुंभ के पूर्ण होने पर जो विचार मन में आए, उन्हें मैंने कलमबद्ध करने का… pic.twitter.com/TgzdUuzuGI
— Narendra Modi (@narendramodi) February 27, 2025