పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మాపై దాడి చేస్తే, మేము మరింత బలంగా ప్రతిదాడి చేస్తాం. మా సంయమనం బలహీనత కాదు. భద్రతపై రాజీపడే ఉద్దేశం లేదు..అని మోడీ జేడీ వాన్స్ కు వెల్లడించారు.
మరోవైపు.. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. మళ్లీ పాక్ కాల్పులకు తెగబడితే.. ధీటుగా స్పందించాలని ఆర్మీని ఆదేశించారు.