Video : ఇద్దరు ప్రత్యేక అతిథులను క‌లుసుకున్న ప్ర‌ధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ హౌస్‌లోని తన కార్యాలయంలో ఇద్దరు ప్రత్యేక అతిథుల‌ను క‌లుసుకున్నారు.

By Medi Samrat  Published on  26 Jun 2024 7:30 PM IST
Video : ఇద్దరు ప్రత్యేక అతిథులను క‌లుసుకున్న ప్ర‌ధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ హౌస్‌లోని తన కార్యాలయంలో ఇద్దరు ప్రత్యేక అతిథుల‌ను క‌లుసుకున్నారు. వారిని చూడగానే.. వారితో మాట్లాడిన వెంటనే ప్రధాని న‌రేంద్ర మోదీ ముఖం వెలిగిపోయింది. ఆ అతిథులిద్దరూ ప్ర‌ధానిపై రాసిన కవితను కూడా ఆయ‌న‌కు వినిపించారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. దత్తాత్రేయతో పాటు ఆయ‌న కూతురు, మనవరాళ్లు కూడా ఉన్నారు. దత్తాత్రేయ మనుమరాళ్లిద్దరూ ప్రధానిని కలవాలనే కోరికను వ్యక్తం చేయగా.. దత్తాత్రేయ తిరస్కరించలేక వారిని పీఎంఓ వద్దకు తీసుకెళ్లారు.

అమ్మాయిలిద్ద‌రూ ప్రధాని మోదీకి గులాబీ పువ్వులు ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు కవిత చెప్పడం ప్రారంభించారు. ఆ క‌విత వింటూ ప్ర‌ధాని మోదీ వారిని తన దగ్గరకు పిలిచి లాలించారు. ఆ అమ్మాయిలిద్దరికీ ప్రధాని చాక్లెట్లు కూడా ఇచ్చారు. దీంతో వారు చాలా సంతోషంగా కనిపించారు.

Next Story