ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ

బోండి బీచ్‌లో జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు .

By -  Knakam Karthik
Published on : 14 Dec 2025 7:29 PM IST

International News, PM Modi, Sydneys Bondi Beach, terrorist attack

ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో యూదుల పండుగ హనుక్కా మొదటి రోజు జరుపుకుంటున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు . ఈ దాడి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు భారత ప్రజల తరపున సంతాపం తెలియజేస్తున్నానని ప్రధానమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ఈ దాడిపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆస్ట్రేలియాలోని బాండి బీచ్ వద్ద, యూదుల పండుగ అయిన హనుక్కా తొలిరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈరోజు జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత ప్రజల తరఫున, ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు మేం అండగా ఉంటాం. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని భారతదేశం, అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై జరిగే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది" అని ట్వీట్ చేశారు.

Next Story