అన్నదాతలకు గుడ్‌న్యూస్. పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రేపు (అక్టోబర్ 5న) విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోంది. ఇప్పటి వరకు రైతులకు 17 విడతలుగా డబ్బులను కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు 18వ విడత నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది.
దాదాపు 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000 అందజేయనున్నారు. ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. రైతులు 18వ విడత పీఎం కిసాన్ కింద రూ.2 వేలు అందుకోవాలంటే రైతులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీని కోసం pmkisan.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి.