మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

By Knakam Karthik  Published on  5 Feb 2025 12:10 PM IST
National News, Uttarpradesh, Prayagraj, Pm Modi Holy Bath, Mahakumbha Mela

మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన త్రివేణి సంగమం వద్ద అమృత స్నానం ఆచరించారు. పుణ్యస్నానం సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. మొదట ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి నుచి ఆరైల్ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభ మేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు.

మహాకుంభమేళాకు ప్రధాని మోడీ హాజరైన సందర్భంగా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎన్.ఎస్.జీ భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. 144ఏళ్లకు ఒకసారి..మనిషి జీవితంలో ఒకేసారి వచ్చే మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ, విదేశాలు నుంచి కూడా భక్తులు తరలిరావడం జరిగింది. ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.

Next Story