మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

పీఎం కిసాన్‌ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ నిన్న విడుదల చేశారు. దేశంలోని 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ చేశారు.

By అంజి  Published on  19 Jun 2024 6:27 AM IST
Prime Minister Modi, PM Kisan funds, Farmers

మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

పీఎం కిసాన్‌ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ నిన్న విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దేశంలోని 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ చేశారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2 వేలు పడతాయి. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో నో యువర్‌ స్టేటస్‌ ఆప్షన్‌పై నొక్కి మీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. మోదీ ఈ నెల 10వ తేదీన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు.

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేసి కుడి వైపున ఉన్న నో యువర్ స్టేటస్ ట్యాబ్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేస్తే మీ స్టేటస్ కనిపిస్తుంది. హోమ్ పేజీలో ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ట్యాబ్ ఎంచుకుంటే అందులో లబ్ధిదారుల జాబితా వివరాలు కనిపిస్తాయి. షెడ్యూల్ ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంటారు. దీంతో ఇప్పుడు రైతుల అకౌంట్లలో 2 వేలు జమ చేశారు. సందేహాలకు పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ 18001155266, 155261 లకు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. pmkisan-ict@gov.in ఈ మెయిల్ ఐడీతో కూడా కాంటాక్ట్ కావొచ్చు.

Next Story