నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

Prime Minister Modi flagged off the Vande Bharat Express in Himachal Pradesh. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఉనా రైల్వే స్టేషన్‌ నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ

By అంజి  Published on  13 Oct 2022 6:11 AM GMT
నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఉనా రైల్వే స్టేషన్‌ నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర మంత్రి, హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు ఈ రైలు నడవనుంది. పీఎంవో ప్రకారం.. ఇది దేశంలో ప్రవేశపెట్టబడిన నాల్గవ వందే భారత్ రైలు. అలాగే మునుపటి వాటితో పోలిస్తే ఇది అధునాతన వెర్షన్. చాలా తేలికైనది, ఎత్తుకు చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. తక్కువ వ్యవధిలో చాలా వేగాన్ని అందుకోగలదు.

ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందనుంది. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ విధానాన్ని అందిస్తుంది. ఇది దేశంలో నాల్గవ వందే భారత్ రైలు, మిగిలిన మూడు న్యూ ఢిల్లీ - వారణాసి, న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, గాంధీనగర్ - ముంబై మధ్య నడుస్తున్నాయి. రైల్వేస్ ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లలో రిక్లైనింగ్ సీట్లు, ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ కెమెరాలు, వైఫై సౌకర్యంతో కూడిన ఆన్-డిమాండ్ కంటెంట్, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్, జీపీఎస్‌ సిస్టమ్‌లు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

Next Story