మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల

మణిపూర్‌లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది

By -  Knakam Karthik
Published on : 4 Feb 2026 5:20 PM IST

National News, Manipur, President Rule, Government of India

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల

మణిపూర్‌లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక గెజెట్ ద్వారా ప్రకటన చేసింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను తక్షణమే ఉపసంహరించారు. కేంద్రం నిర్ణయం మేరకు, రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధమైన, సాధారణ రాజకీయ వ్యవస్థ పునరుద్ధరించబడింది. రేపు సాయంత్రం ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఖేమ్‌చంద్ సింగ్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2022లో బీరెన్ సింగ్ కేబినెట్‌లో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

మణిపూర్‌లో గత సంవత్సరం నెలకొన్న అస్థిరత, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన రద్దు కావడం వల్ల, మణిపూర్‌లో తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం లేదా కొత్త రాజకీయ సమీకరణాలు బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని శాంతిభద్రత పరిస్థితులు మెరుగుపడటంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story