రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. స్వావలంబన భారతదేశం దిశగా మన దేశం వేగంగా దూసుకుపోతోంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయన్నారు.
దేశంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోందని అన్నారు. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలో రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జల్ జీవన్ మిషన్ కింద నేడు దేశంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు.
ప్రజలు గౌరవంగా ప్రవర్తించడం ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని అన్నారు. దేశంలో ఆరోగ్య అసమానతలు తగ్గుతున్నాయి. దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోందన్నారు.
ఈ సంవత్సరం మనం ఉగ్రవాద భారాన్ని భరించాల్సి వచ్చిందని అన్నారు. ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. సైనిక చర్య 'ఆపరేషన్ సింధూర్' భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించగల సమర్థులమని ప్రపంచానికి చాటి చెప్పింది. సైనిక చర్య తీసుకోవడం ద్వారా మన సైన్యం సరిహద్దులోని ఉగ్రవాదులను, వారి రహస్య స్థావరాలను నాశనం చేసింది. మన ఐక్యత మన ప్రతిస్పందనకు గొప్ప బలం. భారతదేశ ఐక్యత మన శత్రువుకు అత్యంత సముచితమైన సమాధానం అని అన్నారు.