ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

By Knakam Karthik
Published on : 22 July 2025 1:39 PM IST

National News, President Droupadi Murmu, resignation of Jagdeep Dhankhar, Pm Modi

ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రభవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్‌ ఉప రాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. అనంతరం దీనిని హోం శాఖ నోటిఫై చేసి ఈ నిర్ణయం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తుందని రాజ్యసభకు తెలిపింది.

కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్ ఖడ్ రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. తొలిరోజు కార్యకలాపాలు ముగిసి సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత ధన్ ఖడ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. దీంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన రిలీజ్ చేసింది.

రాజీనామాపై మోదీ స్పందన..

మరోవైపు ప్రధాని మోదీ జగదీప్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ దేశానికి అనేక సేవలందించారని, ఉపరాష్ట్రపతి సహా అనేక పదవుల ద్వారా సేవలందించారని కొనియాడారు.

Next Story