మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు

By -  Knakam Karthik
Published on : 6 Oct 2025 7:25 PM IST

National News, Bihar, Prashant Kishor

మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలకు లేదా వ్యక్తులకు లేదా పార్టీలకు ఇచ్చిన సలహాల ద్వారా రూ. 241 కోట్లు సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో దాదాపు 31 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు తెలిపారు. రూ. 20 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించానని, అలాగే జన్ సురాజ్ పార్టీకి రూ. 98.95 కోట్లు విరాళంగా ఇచ్చానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను ఇతరుల మాదిరిగా దొంగను కాదని ఆయన అన్నారు.

డబ్బులు ఎలా వచ్చాయో, వాటిని ఏ విధంగా ఖర్చు చేశానో స్పష్టంగా చెప్పగలనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. తాను గతంలో పార్టీలకు, వ్యక్తులకు సలహాలు ఇచ్చినందుకు ఎలాంటి రుసుము వసూలు చేయలేదని, రాజకీయాల్లోకి ప్రవేశించాక తీసుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేయనుంది.

Next Story