ప్రసాదంపై జీఎస్టీ ఉండదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు తెలిపారు.

By Medi Samrat
Published on : 25 March 2025 6:30 PM IST

ప్రసాదంపై జీఎస్టీ ఉండదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చలకు సమాధానమిస్తూ, ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తోందని సీతారామన్ అన్నారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటి రోజు నాటికి సెలెక్ట్ కమిటీ తన నివేదికను సమర్పించాలని ఆదేశించింది కేంద్రం.

ఇక జీఎస్టీ నుండి ఆలయ ప్రసాదాలను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ వర్తించదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులలో నెలకొన్న అనిశ్చితిని తొలగించే క్రమంలో ఆన్‌లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీ/డిజిటల్ పన్నును రద్దు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

Next Story