మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనపై బ్రోకర్లు అంటూ రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్

Prakash Raj tweet Telangana MLAs horse trading issue. దేశ రాజాకీయాల్లో మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటన తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి

By Medi Samrat  Published on  4 Nov 2022 3:30 PM GMT
మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనపై బ్రోకర్లు అంటూ రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్

దేశ రాజాకీయాల్లో మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటన తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే..! అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ''ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకున్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు'' అంటూ ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. డీల్ మాట్లాడుతున్న వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ప్రసంగంతో పాటు మీడియాకు సమర్పించిన వీడియోలను కూడా ప్రకాష్‌ రాజ్‌ ట్యాగ్‌, పోస్ట్‌ చేశారు. "Shameless Brokers from Delhi..killing democracy ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾರಿಕೊಂಡವರು.. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನೇ ಹಾರಾಜಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.. #LotusLeaks #justasking" అంటూ ప్రకాష్ రాజ్ పోస్టు పెట్టరు.

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు భారీ ఆపరేషన్‌ చేధించామని తెలంగాణ పోలీసులు తెలిపారు.


Next Story