అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది

By Medi Samrat
Published on : 2 Aug 2025 6:15 PM IST

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది. పనిమనిషిపై అత్యాచారం కేసులో అతనికి జీవితఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2021లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రేప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ 2024, మే 21న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పలువురు మహిళలు సైతం ప్రజ్వల్ తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. విచారణలో భాగంగా ప్రజ్వల్ ఫోన్ ను తనిఖీ చేయగా రెండు వేలకు పైగా వీడియోలు బయటపడ్డాయి. 14 నెలల రిమాండ్ తర్వాత బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు శిక్ష ఖరారు చేసింది.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫలితాలు వెలువడే సమయానికి ప్రజ్వల్ విదేశాలకు పారిపోగా, కుటుంబ సభ్యుల సూచనతో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని ప్రజ్వల్ రేవణ్ణ అభ్యర్థించారు. న్యాయమూర్తిని వేడుకుంటున్న సమయంలో బోరున విలపించాడు.

Next Story