ఆ సమయంలో నవ్వమ‌ని బలవంత పెట్టాడు.. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు మూడవ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నమోదు చేసిన మూడవ ఛార్జ్ షీట్ లో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి

By Medi Samrat
Published on : 14 Sept 2024 12:53 PM IST

ఆ సమయంలో నవ్వమ‌ని బలవంత పెట్టాడు.. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు మూడవ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నమోదు చేసిన మూడవ ఛార్జ్ షీట్ లో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అతను దారుణాలను చేస్తున్నప్పుడు బాధితురాలిని నవ్వమని బెదిరించాడని తేలింది. లోదుస్తులు ధరించి కనిపించడమే కాకుండా నవ్వమని బలవంతం చేసేవాడని ఛార్జ్ షీట్ లో వెల్లడించారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఎమ్మెల్యేలు/ఎంపీల కోసం ప్రత్యేక కోర్టుకు 1,691 పేజీల ఛార్జ్ షీట్‌ను సమర్పించింది. బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా జత చేసింది.

ప్రజ్వల్ తనను తుపాకీతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, తన నగ్న వీడియోలను చిత్రీకరించాడని, స్క్రీన్‌షాట్‌లు తీశాడని బాధితురాలు తెలిపింది. లైంగిక వేధింపుల సమయంలో బాధితురాలు ఏడవకూడదని, నవ్వుతూ ఉండాలని అతను పట్టుబట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 2020 నుంచి 2023 వరకు మూడేళ్లపాటు బాధితురాలిపై ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమెను తన హోలెనరసిపుర నివాసానికి పిలిచి మూడవ అంతస్తులోని ఒక గదిలో అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన ప్రతిసారీ వీడియో రికార్డ్ చేసి ఎవరికైనా చెబితే బయట పెడతానని బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.

Next Story