సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత

Pragya Thakur complains of breathing problem. బీజేపీ నాయ‌కురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది

By Medi Samrat  Published on  6 March 2021 1:33 PM GMT
Pragya Thakur complains of breathing problem

బీజేపీ నాయ‌కురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పడంతో ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి త‌ర‌లించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాల‌యం అధికారులు ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు ప్రజ్ఞా ఠాకూర్‌ కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్‌లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆమె ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆమె హెల్త్ బులెటిన్ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story
Share it