ప్రేమతో ఈ యుద్ధం చేశాం : రాహుల్ గాంధీ

'Power of love' - What Rahul Gandhi said after Congress's big win. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on  13 May 2023 5:15 PM IST
ప్రేమతో ఈ యుద్ధం చేశాం : రాహుల్ గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. ట్రెండ్స్‌లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వ‌చ్చింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డానికి భార‌త్ జోడో యాత్ర కూడా క‌లిసి వ‌చ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజ‌యంపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కర్నాటకలో విద్వేషాల మార్కెట్‌ మూతపడి.. ప్రేమ దుకాణం తెరుచుకుందని రాహుల్‌ అన్నారు. ఈ విజ‌యాన్ని బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా ఆయన అభిర్ణించారు. కర్ణాటక ప్రజలకు ఐదు వాగ్దానాలు చేశాం. తొలి కేబినెట్‌లో మొదటి రోజే ఈ హామీలను నెరవేరుస్తామ‌న్నారు. కర్ణాటకలో పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ప్రేమతో ఈ యుద్ధం చేశాం. ఈ దేశం ప్రేమను ప్రేమిస్తుందని కర్ణాటక చూపించిందన్నారు.


Next Story