Video : 'సీఎం అజిత్ దాదా'.. ఫలితాలకు ముందే పోస్టర్ వార్‌

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 23 శనివారం జరగాల్సి ఉండగా..

By Medi Samrat  Published on  22 Nov 2024 8:45 PM IST
Video : సీఎం అజిత్ దాదా.. ఫలితాలకు ముందే పోస్టర్ వార్‌

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 23 శనివారం జరగాల్సి ఉండగా.. అంతకుముందే ముఖ్యమంత్రి పదవికి పోస్టర్ వార్ మొదలైంది. శుక్రవారం పూణెలో ఎన్‌సిపి అధినేత అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా చూపే పోస్టర్‌ను ఏర్పాటు చేసి.. ఫలితాలకు ముందు రాజకీయ ప్రకంపనలు పెంచారు. వార్తా సంస్థ ANI ప్రకారం.. ఈ పోస్టర్‌ను NCP నాయకుడు సంతోష్ నాంగ్రే ఏర్పాటు చేయ‌గా.. ఇప్పుడు దానిని తొలగించారు.

ఈ విషయమై సంతోష్ నాంగ్రే మీడియాతో మాట్లాడుతూ.. 'అజిత్ దాదా మహారాష్ట్రకు చెందిన మాస్ లీడర్. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మాట్లాడుతున్నారు. అందుకే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు, యువత అందరూ ఆయనను ఇష్టపడుతున్నారు. ఆయన ఈసారి సీఎం కావాలని భావిస్తున్నాం. అందుకే ఈ బ్యానర్‌ పెట్టామ‌న్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగ‌నుంది. అధికార మహాయుతి కూటమి, మహావికాస్ అఘాడీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహాకూటమిలో బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ప్రధాన పార్టీలు. మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ వర్గం, శివసేన ఉద్ధవ్ వర్గం ఉన్నాయి.

Next Story