అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు.. రేపో మాపో ప్రకటన!

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి

By అంజి  Published on  6 Oct 2023 8:15 AM GMT
Assembly Poll, Election Commission, Chhattisgarh, Telangana

అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు.. రేపో మాపో ప్రకటన!

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (EC) వర్గాలు తెలిపాయి. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలు 2018లో చివరిసారిగా లాగే ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నారని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో, 2018లో ఎలా జరిగిందో అదే విధంగా రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని వారు తెలిపారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు.

మిజోరాం శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తెలంగాణలో పాలిస్తుంగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల సంసిద్ధతను ఈసీ పరిశీలించింది. ఎన్నికల కసరత్తు సజావుగా సాగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం శుక్రవారం తన పరిశీలకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Next Story