Video: ఎవరూ అలా చేయొద్దని చేసి చూపించాడు..తర్వాత అరెస్టయ్యాడు

ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన పనితో పోలీసులు షాక్ ఇచ్చారు.

By -  Knakam Karthik
Published on : 31 Dec 2025 1:03 PM IST

National News, Uttarapradesh, Viral Video, Mau district, Instagram Reels, Ajay Raj, Social Media Stunt

Video: ఎవరూ అలా చేయొద్దని చేసి చూపించాడు..తర్వాత అరెస్టయ్యాడు

దేశంలో ఈ మధ్య కొందరు యూత్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం అనేక ప్రయోగాలు చేస్తూ అనవసర కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నారు. అదే కోణంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన పనితో పోలీసులు షాక్ ఇచ్చారు. రీల్చ్ పిచ్చిలో తన ప్రాణాలను పణంగా పెట్టి..పట్టాలపై పడుకుని తన పైనుంచి వెళుతున్న రైలును రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ప్రమాదకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోలీసుల దాకా చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. రీల్ తీసిన మరునాడే యువకుడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

వివరాల్లోకి వెళితే..మౌ జిల్లాకు చెందిన అజయ్ రాజ్‌ బర్ ఇన్ స్టాగ్రామ్ లో కామెడీ, ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. తన ఫాలోవర్లను థ్రిల్ చేయడం కోసం ఇటీవల పట్టాలపై వెళుతున్న రైలును వీడియో తీశాడు. రైలు వస్తుండగా పట్టాల మధ్యలో పడుకుని మొబైల్ తో షూట్ చేశాడు. రైలు వెళ్ళిపోయే వరకు అలాగే పడుకొని ఉన్నాడు.

ఆపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ ఎవరూ చేయొద్దంటూ అజయ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అజయ్ రాజ్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రీల్స్ కోసం ప్రాణాలను రిస్క్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.

Next Story