స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. పంజాబ్‌లో ఉగ్రకుట్ర భగ్నం

Police busted a terror plot in Punjab. స్వాతంత్ర్య దినోత్సవ వేళ పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన

By అంజి  Published on  14 Aug 2022 11:47 PM GMT
స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. పంజాబ్‌లో ఉగ్రకుట్ర భగ్నం

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారులో విధ్వంసానికి కొందరు ఉగ్రవాదులు సిద్ధంకాగా.. వారి చర్యను ఢిల్లీ పోలీసుల సహకారంతో పంజాబ్‌ పోలీసులు అడ్డుకున్నారు. కెనడాకు చెందిన అర్ష్‌ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్‌ సింగ్‌తో సంబంధమున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు 9 ఎంఎం పిస్టల్స్‌, 40 లైవ్‌ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నామని పంజాబ్‌ డీజీపీ వెల్లడించారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పంజాబ్‌ నిఘా విభాగం.. గ్యాంగ్‌స్టర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌దల్లా సన్నిహితులు ఇద్దరిని అరెస్టు చేశారు. అర్ష్‌దల్లా స్వస్థలం మోగా కాగా.. ప్రస్తుతం ఇతను కెనడాలో ఉంటున్నాడు. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ ఇతనిపై.. చాలాకాలంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.

Next Story