చైనాలోని టియాన్‌జిన్ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే అని పేర్కొన్నారు. పుతిన్‌ను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సంభాషించినట్టు పేర్కొన్నారు. అటు ఈ సదస్సులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. పీఎం మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ప్రధాని మోదీ - పుతిన్ ఏకాంతంగానూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీ, పుతిన్ కలిసి మాట్లాడుకుంటుండగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనకాలే సెక్యూరిటీ గార్డులా నిలబడ్డారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. భారత్, రష్యా దేశాధినేతల స్నేహం, ఆప్యాయత చూసి పాక్ ప్రధాని వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. నిన్న జిన్‌పింగ్, పుతిన్.. షరీఫ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశాలని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదే వేదికలో ప్రధాని మోదీ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డొగన్‌ను కలిశారు. వివిధ దేశాధ్యక్షులు గ్రూప్ ఫొటో దిగే సమయంలో ఈ ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు బహిరంగంగానే సపోర్ట్ చేసింది. అంతే కాదు 350 డ్రోన్లు, ఆపరేటర్లను పాక్ ఆర్మీకి ఇచ్చి, మన దేశానికి వ్యతిరేకంగా పని చేసింది.