దటీజ్ టాటా గ్రూప్.. మోదీ కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు
PM Praises Tata Group's "Compassionate Gesture" To Ease Oxygen Crisis. లిక్విడ్ ఆక్సిజన్ రవాణా కోసం 24 క్రయోజనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామని టాటా గ్రూప్ ప్రకటించింది.
By Medi Samrat Published on 21 April 2021 9:26 AM GMTటాటా గ్రూప్.. ఎన్నో సేవాకార్యక్రమాలను చేస్తూ వెళుతోంది. భారత్ లో కరోనా పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి కూడా ఎన్నో చర్యలను చేపట్టింది. టాటా ట్రస్ట్ గత ఏడాది కరోనాను కట్టడి చేసే కార్యక్రమాల కోసం ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయించింది. కేరళలో ఆరు వారాల్లోనే ఓ ఆసుపత్రిని నిర్మించడం కూడా గొప్ప ఘటనే..! ఇక వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్లు వంటివాటిని అందజేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.. ఆక్సిజన్ లేకపోవడం వలన చాలా మృత్యువాత పడుతూ ఉన్నారు. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి లిక్విడ్ ఆక్సిజన్ రవాణా కోసం 24 క్రయోజనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామని టాటా గ్రూప్ ప్రకటించింది.
లిక్విడ్ ఆక్సిజన్ ని ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు 24 క్రయోజెనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామంటూ ట్విటర్ ద్వారా ఆ సంస్థ తెలిపింది. కరోనాపై పోరాటంలో మేము మా వంతు కృషి చేస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ఆక్సిజన్ సంక్షోభాన్ని తగ్గించేందుకు, ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టపరిచేందుకు తాము 24 క్రయోజనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. దేశంలో తాము హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బూస్ట్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. టాటా గ్రూప్ 24 క్రయోజెనిక్ కంటైనర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ కంటైనర్లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను రవాణా చెయ్యవచ్చు. కొంతైనా దేశంలోని ఆక్సిజన్ కొరత సమస్య తీరుతుందని టాటా గ్రూప్ ప్రకటించింది.
ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు. టాటా గ్రూప్ ట్వీట్ పై మోదీ స్పందిస్తూ, టాటా గ్రూప్ కారుణ్యంతో వ్యవహరిస్తోందని ప్రశంసించారు. భారతీయులంతా కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుదామని అన్నారు. తన వివిధ ధార్మిక కార్యక్రమాల ద్వారా టాటా గ్రూప్ ట్రస్ట్ ప్రజలకు సేవలందిస్తున్నదని, ఇందుకు కృతజ్ఞతలని మోదీ ట్వీట్ చేశారు.