ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

US అధ్యక్ష ఎన్నికల 2024 ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

By Medi Samrat  Published on  6 Nov 2024 9:29 AM GMT
ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

US అధ్యక్ష ఎన్నికల 2024 ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ట్వీట్‌లో.. నా ప్రియ‌మైన స్నేహితుడు ట్రంప్‌ చారిత్రాత్మక విజయానికి శుభాకాంక్షలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాలపై ఆధారపడినందున.. భార‌త్‌-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను. మన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కలిసి పని చేద్దామ‌ని త‌న సందేశంలో రాశారు.

అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మారిసన్ సోషల్ మీడియా పోస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ట్రంప్‌తో ఒక చిత్రాన్ని పంచుకుంటూ.. అభినందనలు అధ్యక్షుడు ట్రంప్ అని రాశారు. అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో "ఆయ‌న‌ మునుపటిలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు" అని రాశారు.

ట్రంప్ విజయంపై అభినందనలు తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. "ట్రంప్ పునరాగమనం అమెరికాకు కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఇజ్రాయెల్‌తో శక్తివంతమైన కూటమికి మళ్లీ కట్టుబడి ఉంది" అని అన్నారు.

అమెరికాలో ప్రెసిడెంట్ కావడానికి మెజారిటీ మార్క్ 270. ఎందుకంటే మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. గెలవడానికి 270 లేదా అంతకంటే ఎక్కువ అవసరం. డొనాల్డ్ ట్రంప్‌కు 267 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయి.

Next Story