సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని మోదీ

PM Narendra Modi appointed chairman of Somnath temple trust.ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సోమ్‌నాథ్ ఆల‌య ట్ర‌స్ట్ ఛైర్మన్‌గా ప్రధాని మోదీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 10:32 AM IST
PM Narendra Modi appointed chairman of Somnath temple trust

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సోమ్‌నాథ్ ఆల‌య ట్ర‌స్ట్ కొత్త ఛైర్మ‌న్‌గా ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుజ‌రాత్‌లోని గిర్ సోమ‌నాథ్ జిల్లాలోని ప‌టాన్ ప‌ట్ట‌ణంలో ఉన్న ఈ ఆల‌య ట్ర‌స్ట్‌కు ఇప్ప‌టికే ట్ర‌స్టీగా మోదీ కొన‌సాగుతున్నారు. కాగా.. ఛైర్మ‌న్‌గా మోదీనే ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

సోమ్‌నాథ్ ఆల‌య ట్ర‌స్ట్‌కు ప్ర‌ధాని మోదీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. 'సోమ్‌నాథ్ ఆల‌య ట్ర‌స్ట్‌కు అధ్య‌క్షుడైన ప్ర‌ధాని మోదీకి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఆల‌యం మొత్తాన్ని అభివృద్ది చేయాల‌న్న ఆయ‌న సంక‌ల్పం నిజంగా అద్భుతం. మోదీ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన క‌మిటీ ఆల‌య ప్ర‌తిష్ట‌, గౌర‌వాన్ని మ‌రింత ముందుకు తీసుకువెలుతుంద‌ని నేను ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను' అని అమిత్ షా ట్వీట్ చేశారు.


గత కొన్నేళ్ల పాటు ట్రస్టు ఛైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌ మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ అక్టోబర్‌లో మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆలయ ట్రస్టు 120వ సమావేశంను సోమవారం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు కొత్త ఛైర్మన్‌గా ప్రధాని మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ట్రస్టీ సెక్రటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. ఈ ట్రస్టులో ఇతర ట్రస్టీలుగా బీజేపీ నేత ఎల్‌కే అద్వాని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ఉన్నారు.




Next Story