ఆసుపత్రి పాలైన ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు

PM Modi's Younger Brother Prahlad Modi Hospitalised Due To Kidney Problem. కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు

By M.S.R  Published on  28 Feb 2023 3:47 PM IST
ఆసుపత్రి పాలైన ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు

కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రధాని మోదీకి ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. నగరంలో టైర్ షోరూమ్‌ను కూడా కలిగి ఉన్నారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైజ్ షాప్ డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీకి ఒక సోదరి, నలుగురు సోదరులు ఉన్నారు. సోమ మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాద్ మోదీ, సోదరి వాసంతి మోదీ ఉన్నారు.

దామోదర్ దాస్ ముల్ చంద్ మోదీ, హీరాబెన్ దంపతులకు నాలుగో సంతానమే ప్రహ్లాద్ మోదీ. ప్రహ్లాద్ మోదీ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. చికిత్స తీసుకునేందుకే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి, మధురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్టు తెలిసింది. గత డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.


Next Story