శతవసంతంలోకి హీరాబెన్.. తల్లికి పాదపూజ చేసిన మోదీ
PM Modi writes blog dedicated to his mother on her birthday.ప్రధాని నరేంద్ర మోదీ అమ్మగారైన హీరాబెన్ ఈ రోజు శత
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2022 5:58 AM GMTప్రధాని నరేంద్ర మోదీ అమ్మగారైన హీరాబెన్ ఈ రోజు శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి ప్రధాని వెళ్లారు. తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఆమె కాళ్లు అడిగారు. అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు అరగంట పాటు ప్రధాని మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. జూన్ 18, 1923లో హీరాబెన్ జన్మించారు.
హీరాబెన్ వందవ పుట్టిన రోజు సందర్భంగా మోదీ సోషల్ మీడియా కొన్ని అభిప్రాయాలను పంచుకున్నారు. తన బ్లాగ్‌లో అభిప్రాయాలు ఉన్న లింక్‌ను పోస్టు చేశారు. తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం అమ్మ చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమ్మ అనే మాట ఓ డిక్షనరీలో పదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం. తల్లి పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. వారి ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. పిల్లలకు సేవ చేసే క్రమంలో నిస్వార్థమైన త్యాగం చేస్తుందన్నారు.
Took blessings of my mother today as she enters her 100th year... pic.twitter.com/lTEVGcyzdX
— Narendra Modi (@narendramodi) June 18, 2022
తన తల్లి హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టడం తనకు సంతోషాన్ని ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. 'చదువు లేకపోయినా జీవితాన్ని నేర్చుకోవచ్చునని తెలిసేలా చేసింది అమ్మేనని, ఒకసారి నాకు చదువు చెప్పిన టీచర్లు అందరినీ సన్మానించాలని అనుకున్నా. నాకు అమ్మే టీచర్. అందుకనే ఆమెనూ సన్మానించాలని ఆహ్వానించా. అయితే.. ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆమెకు బదులు నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన స్థానిక టీచర్ ఒకరిని గౌరవించమని చెప్పారు. ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటా'యని మోదీ రాసుకొచ్చారు.