నేడు మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ‌నివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  5 Oct 2024 7:20 AM IST
నేడు మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ‌నివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముంబైలో మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్, కోలాబా-బాంద్రా-సీప్జ్ ముంబై మెట్రో లైన్-3 ను ప్రారంభించనున్నారు. ముంబయిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కూడా చేయ‌నున్నారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ప్రధానమంత్రి మోదీ లైన్ 3 ఫ్లాగ్ ఆఫ్ వేడుక కోసం BKC మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అంత‌కు ముందు BKC నుండి శాంటా క్రజ్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రోలో ప్ర‌యాణిస్తారు. ప్రయాణంలో ఆయ‌న‌ రైలులో లడ్కీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషించనున్నారు.

Next Story