ఆ కళాఖండాలను భారత్‌కు అప్పగించిన అమెరికా..!

PM Modi to bring back 157 antiquities handed over by US.ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది.

By అంజి  Published on  26 Sep 2021 8:00 AM GMT
ఆ కళాఖండాలను భారత్‌కు అప్పగించిన అమెరికా..!

ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ, యూఎన్ఓ సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు పోరాడాలని ప్రపంచ వేదికపై పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొవడంతో పాటు, వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ ముందు వరుసలో ఉందన్నారు.

కాగా అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి 157 భారత కళాఖండాలు, పురాతన వస్తువులను అమెరికా అందజేసింది. గతంలో ఈ కళాఖండాలు భారత్‌ నుండి చోరీలకు, అక్రమ రవాణాకు గురిఅయ్యాయి. భారత కళాఖండాలను, వస్తువులను తిరిగి ఇవ్వడం పట్ల అమెరికాపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. దొంగతనం, అక్రమ వ్యాపారం, సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణకు వ్యతిరేకంగా తమ ప్రయత్నాలు సాగుతాయని ప్రధాని మోడీ, బైడెన్ అన్నారు. అమెరికా అప్పగించిన ఈ పురాతన వస్తువులు ఎక్కువగా 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తున్నాయి. 2000 బీసీ నాటి కాపర్‌ ఆంత్రోపోమోర్ఫిక్ ఆబ్జెక్ట్ నుంచి 2 శతాబ్దం నాటి టెర్రకోట వాజ్‌కు చెందిన అనేక చారిత్రక పురాతన వస్తువులను అమెరికా భారత్‌కు అప్పగించింది. అలాగే 47 పురాతన వస్తువులు సాధారణ యుగం నాటి కంటే ముందువిగా తెలిశాయి.

అమెరికా అప్పగించిన 157 పురాతన వస్తువుల్లో 71 భారత సంస్కృతికి చెందినవి ఉన్నాయి. మరో 60 వస్తువులు హిందూమతం, 16 వస్తువులు బౌద్ధమతం, 9 వస్తువులు జైనమతంకు చెందినవి ఉన్నాయి. 10వ శతాబ్దానికి చెందిన ఇసుకరాయిలోని రేవంత ఒకటిన్నర మీటర్ల బేస్‌ రిలీఫ్ ప్యానెల్‌ నుండి 12వ శతాబ్దానికి చెందిన 8.5 సెం.మీ పొడవు గల సున్నితమైన కాంస్య నటరాజా విగ్రహాలు ఉన్నాయి. కాంస్య విగ్రహాల్లో ప్రధానంగా లక్ష్మీనారాయణ, బుద్ధుడు, విష్ణువు, శివపార్వతి, 24 మంది జైన తీర్థంకరులు, కంకలమూర్తి, బ్రహ్మీ, నందికేసుల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు, పురాతన వస్తువులు పూర్తిగా మెటల్, రాయి, టెర్రకోటతో తయారు చేయబడ్డాయి. హిందూ మతానికి చెందిన శిల్పాలు ఉన్నాయి. అందులో మూడు తలల బ్రహ్మ, రథాన్ని నడిపించే సూర్య, విష్ణువు, నృత్యం చేసే వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి.

Advertisement

Next Story
Share it