నెహ్రూ జయంతి.. నివాళుల‌ర్పించిన ప్రధాని మోదీ, సోనియా గాంధీ

PM Modi paid tribute to Nehru. నేడు భారత మాజీ, మొట్ట మొదటి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి. ఈ సందర్భంగా జవహర్‌ లాల్‌ సేవలను ప్రధాని నరేంద్ర

By అంజి  Published on  14 Nov 2021 12:02 PM IST
నెహ్రూ జయంతి.. నివాళుల‌ర్పించిన ప్రధాని మోదీ, సోనియా గాంధీ

నేడు భారత మాజీ, మొట్ట మొదటి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి. ఈ సందర్భంగా జవహర్‌ లాల్‌ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ సర్మించుకున్నారు. అనంతరం నివాళులర్పించారు. నెహ్రూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. 1889లో జన్మించారు. దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని శాంతి వనం దగ్గర నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ జవహర్‌ లాల్‌ నెహ్రూకి నివాళులర్పించారు. నెహ్రూ సత్యం, ఐక్యత, శాంతికి ఎంతో విలువ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలతో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ, రాహుల్ గాంధీ తన ఆలోచనను పోస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ కూడా నెహ్రుకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 1889, న‌వంబ‌ర్ 12న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌న్మించారు. 1964, మే 27న మ‌ర‌ణించారు. నెహ్రూ పుట్టిన రోజున నాడు బాల‌ల దినోత్స‌వాన్ని జరుపుకుంటారు.




Next Story