ఈ నెల 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌.. భారీ ఏర్పాట్లు

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 May 2024 11:34 AM GMT
pm modi, nomination,  Varanasi,  may 14th, bjp,

ఈ నెల 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌.. భారీ ఏర్పాట్లు 

దేశంలో లోక్‌సభ ఎన్నికలు పలు విడుతల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పటిష్టబందోబస్తు మధ్య పోలింగ్‌ను నిర్వహించనున్నారు.

ఇక మరోవైపు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 14వ తేదీన ప్రధాని మోదీ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ దాదాపు రెండ్రోజుల పాటు వారణాసిలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారీ రోడ్‌షోలు.. ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ నామినేషన్‌ దాఖలుకి సంబంధించి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ పనులను స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ నాయకుడు సునీల్ బన్సల్ కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు సందర్భంగా పలు ఆలయాలను దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను ప్రధానిమోదీ దర్శించుకునే చాన్స్ ఉంది. బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు గంటల పాటు రోడ్‌షోను నిర్వహిస్తారు. అదే రోజు ఎన్‌డీఏ నేతల సమావేశంలో పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిరంతరం ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ గతంలో దాఖలు చేసిన నామినేషన్ వివరాల ప్రకారం.. ఆయన వయసు 73 ఏళ్లు. ప్రధాని మోదీ మే చివరి నాటికి 190 వరకు రోడ్‌షోలు.. ర్యాలీలు, సభల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story