ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్రధాని మోదీ

PM Modi flag hoisting at Redfort.దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 2:34 AM GMT
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎర్ర‌కోట వ‌ద్ద ప్ర‌ధాని మోదీకి ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఉన్నతాధికారులు స్వాగ‌తం ప‌లికారు. త్రివిధ ద‌ళాల నుంచి ప్ర‌ధాని గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌ధాని మోదీ.. జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాగా.. జాతీయ జెండా ఎగుర‌వేయ‌డానిక‌న్నా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఉంచారు. అంతకుముందు దేశ ప్రజలకు 75 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు పౌరుల్లో కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని నింపాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ' ఆజాది కా అమృత్ మహోత్సవం' ఈ సంవత్సరం దేశ ప్రజల్లో కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని నింపాలి. జై హింద్!' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Next Story