పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడంటే..
దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్.
By Srikanth Gundamalla Published on 17 May 2024 8:16 AM GMTపీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడంటే..
దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతులకు ఈ పథకాన్ని వర్తింప జేస్తున్నారు. ఈ స్కీమ్‌ను తొలిసారిగా 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారు. మూడు విడుతలుగా రూ.2వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో ఈ డబ్బు నేరుగా జమ చేస్తోంది కేంద్రం.
అయితే.. పీఎం కిసాన్ డబ్బులు ఇప్పటి వరకు 16 విడుతలు అందింది. తాజాగా రైతులు 17వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎందురు చూస్తున్నారు. ఈ 16 విడతల్లో రైతులకు మొత్తం రూ.32వేలు అందాయి. చివరి సారిగా 2024 ఫిబ్రవరి 28వ తేదీన రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి. అప్పుడు మొత్తం 9 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 16వ విడత కోసం కేంద్రం రూ.21వేల కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
పీఎం కిసాన్ 17వ విడతల డబ్బులు మే నెల ఆఖర్లో పడే అవకాశం ఉందని సమాచారం. ఒక వేళ మే ఆఖర్లో జమయ కాకపోతే.. జూన్ నెల మొదటి వారంలోనే అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే.. పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఇ-కేవైసీ ముఖ్యంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు అందరూ ఇ-కేవైసీ చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా ఈ ప్రక్రియను పూర్తిచేయని వారు ఉంటే చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌ను యాక్టివ్‌లో ఉంచుకోవాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కు నేరుగా వెళ్లి అక్కడ ఇ-కేవైసీ క్లిక్ చేసి.. ఓటీపీ సాయంతో దీన్ని పూర్తి చేయవచ్చు. లేదంటే పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా కేవైసీ చేసుకోవచ్చు.