పెట్రోల్ ధ‌ర‌ల‌పై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

PM asks states to cut VAT to control rising fuel prices.దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు మండిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2022 2:25 PM IST
పెట్రోల్ ధ‌ర‌ల‌పై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు మండిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లతో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుద‌ల ప్ర‌భావం నిత్యావ‌స‌రాల‌పై ప‌డుతుండ‌డంతో వాటి ధ‌ర‌లు చుక్క‌ల‌నంటున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. గతేడాది న‌వంబ‌ర్‌లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. కేంద్రం వ్యాట్‌ను త‌గ్గించినా.. ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఇంధన ధరలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు.

ఇక‌.. వ్యాట్ త‌గ్గించిన రాష్ట్రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని సూచించారు. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట‍్రాలను కోరుతున్న‌ట్లు తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉత్తరాఖండ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104 ఉండగా.. ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్‌ రూ. పెట్రోల్‌ ధర రూ. 122గా ఉందని ప్ర‌ధాని మోదీ అన్నారు.

Next Story