మ్యాచ్ మ‌ధ్య‌లో ప్రాణాలు వ‌దిలిన బ్యాట్స్‌మెన్‌.. వీడియో వైర‌ల్‌

Player dies during cricket match following heart attack.ఉత్సాహాంగా క్రికెట్ ఆడుతున్న ఆ యువ‌కుడు ఉన్న‌ట్లు ఉండి కుప్ప‌కూలాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 4:32 AM GMT
Player dies during cricket match following heart attack

ఎవ‌రి ప్రాణాలు ఎప్పుడు పోతామో ఎవ‌రికీ తెలీదు. అందుకు నిద‌ర్శ‌నం ఈ ఘ‌ట‌న‌నే. ఉత్సాహాంగా క్రికెట్ ఆడుతున్న ఆ యువ‌కుడు ఉన్న‌ట్లు ఉండి కుప్ప‌కూలాడు. గ‌మ‌నించిన మిగ‌తా వారు వెంట‌నే అత‌డి వ‌ద్ద‌కు వ‌చ్చి చూడ‌గా.. అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న పూణేలోని జున్నార్ మండ‌లంలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. జున్నార్ మండలంలో ఓ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతోంది. బౌల‌ర్ బంతి వేయ‌గా.. బ్యాట్స్‌మెన్ షాట్ ఆడాడు. అయితే.. ఆ బంతి మిస్ అయి కీప‌ర్ చేతిలోకి వెళ్లింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వ్య‌క్తి ప‌రుగుల తీసేందుకు ప్ర‌య‌త్నించి బంతి కీప‌ర్ చేతిలో ప‌డ‌డంతో వెన‌క్కు వ‌చ్చాడు. ఇంకా ఈ ఓవ‌ర్‌లో ఎన్ని బంతులు ఉన్నాయి అని అంపైర్ అడిగాడు. ఎంపైర్ సమాధానం చెప్ప‌గా.. త‌న స్థానంలో వ‌చ్చి నిలుచున్నాడు. బౌల‌ర్ బంతిని వేసేందుకు సిద్ద‌మ‌వుతుండ‌గా.. నాన్‌స్ట్రైకింగ్‌లో నిలుచుకున్న బ్యాట్స్ మెన్ మోకాళ్ల‌పై కూర్చొన్నాడు. అలా కూర్చొని ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. ఏమి జ‌రిగిందో ఎవ‌రికి ఏమీ అర్థం కాలేదు.


అత‌డు ప‌డిపోవ‌డాన్ని గ‌మ‌నించిన అంపైర్ వెంట‌నే అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేసి అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌ను ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. గుండెపోటు కార‌ణంగానే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ప్రాథ‌మికంగా నిర్థారించారు. మృతుని పేరు బాబు నలవాడెగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చూసిన వారంద‌రూ అయ్యే పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story
Share it