Punishment : మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను కడిగిన మాజీ సీఎం

మాజీ సీఎం మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను శుభ్రం చేశారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై సిక్కుల అత్యున్నత సంఘం మతపరమైన శిక్షను అమలు చేసింది.

By Medi Samrat  Published on  3 Dec 2024 1:20 PM GMT
Punishment : మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను కడిగిన మాజీ సీఎం

మాజీ సీఎం మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను శుభ్రం చేశారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై సిక్కుల అత్యున్నత సంఘం మతపరమైన శిక్షను అమలు చేసింది. అకాలీదళ్ అధినేత అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద వీల్‌ఛైర్‌లో కూర్చొని, మెడలో ఫలకం ధరించి, ఈటె పట్టుకుని నిలబడ్డారు. బాదల్ బావమరిది అయిన అకాలీదళ్ సీనియర్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా కూడా స్వర్ణ దేవాలయంలో పాత్రలు కడగడం ద్వారా తన శిక్ష అనుభవించారు. సిక్కు మతాన్ని అవమానించిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా వ్యవహరించినందుకు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సహా పలు గురుద్వారాల్లో మరుగుదొడ్లు కడగాలని, వంటగదిలో అంట్లు తోమాలంటూ సిక్కుల అత్యున్నత కమిటీ అకల్ తఖ్త్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ను ఆదేశించింది.

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2011లో అందించిన ‘ఫఖ్ర్-ఈ-క్వామ్ గౌరవాన్ని కూడా అకల్ తఖ్త్ వెనక్కి తీసుకుంది. సుఖ్‌బీర్ తన తప్పులకు బేషరతు క్షమాపణలు చెప్పిన అనంతరం అకల్ తఖ్త్ ఈ శిక్ష విధించింది. పంజాబ్‌లో అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.



Next Story