తగ్గట్లేగా.. మరోసారి పెరిగిన ఇంధన ధరలు.!

Petrol prices hiked again on november 2 2021. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అయితే కొన్ని నగరాల్లో పెరిగిన ధరలు వేరు వేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌

By అంజి  Published on  2 Nov 2021 8:42 AM IST
తగ్గట్లేగా.. మరోసారి పెరిగిన ఇంధన ధరలు.!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అయితే కొన్ని నగరాల్లో పెరిగిన ధరలు వేరు వేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ పై 40 పైసలు, డీజిల్‌పై 42 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.12, డీజిల్‌ రూ.107.40కి చేరుకుంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ పై 59 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెరగగా.. లీటర్‌ పెట్రోల్‌ రూ.113.83, డీజిల్‌ రూ.107.11కు లభిస్తోంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ పై 44 పైసలు, డీజిల్‌పై 42 పైసలు పెరిగింది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.31, డీజిల్‌ ధర రూ.107.56గా ఉంది. నిజామాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ పై 73 పైసలు, డీజిల్‌పై 73 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.116.08, డీజిల్‌ ధర రూ.109.22కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెట్రోలు ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌ పై 33 పైసలు తగ్గి.. రూ.116.27గా ఉంది. లీటర్‌ డీజిల్‌పై రూ.34 పైసలు తగ్గి రూ.108.89 వద్ద ఉంది. తిరుపతిలో పెట్రోల్‌ పై 70 పైసలు, డీజిల్‌పై 69 పైసలు పెరిగింది. దీంతో తిరుపతిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.25, డీజిల్‌ ధర రూ.109.76గా ఉంది. విశాఖలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.06, డీజిల్‌ ధర రూ.107.73కు చేరుకుంది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04, డీజిల్ ధర రూ.98.42

ముంబై లో లీటర్ పెట్రోల్ రూ. 115.85 ,డీజిల్ ధర రూ.106.23

కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.49, డీజిల్ ధర రూ.101.56

చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.66, డీజిల్ ధర రూ.102.59

Next Story