పెట్రో బాదుడు.. సామాన్యుడి జేబుకు చిళ్లు.!
Petrol and diesel prices today. పెట్రో ధరలు పెంపుతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నాడు. గ్యాప్ లేకుండా ప్రతి రోజు
By అంజి Published on 24 Oct 2021 8:35 AM ISTపెట్రో ధరలు పెంపుతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నాడు. గ్యాప్ లేకుండా ప్రతి రోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ ఇంధన ధరలను మరోసారి పెంచాయి చమురు కంపెనీలు. తాజాగా లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్‌పై 35 పైసలను పెంచారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91, లీటర్ డీజిల్ ధర రూ.105.08కి చేరుకుంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.42కు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.62కి చేరింది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.21, డీజిల్ రూ.105.25గా ఉంది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.37, డీజిల్ ధర రూ.106.44కి దొరుకుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన ధరలు మండిపోతున్నాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.47కి చేరగా.. డీజిల్ రూ.106.04కి లభిస్తోంది. కర్నూలులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.87, లీటర్ డీజిల్ రూ.106.37గా ఉంది. ఇక విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.113.12, డీజిల్ రూ.105.65గా ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, లీటర్ డీజిల్ ధర రూ.96.32
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.46, లీటర్ డీజిల్ ధర రూ.104.38
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.68, లీటర్ డీజిల్ ధర రూ. 100.74
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.34, లీటర్ డీజిల్ ధర రూ.102.23
కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.11, లీటర్ డీజిల్ ధర రూ. రూ.99.43