మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు.. అసలు ఆగేది ఉందా? లేదా?

Petrol and diesel prices rised once more. వామ్మో.! పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ఏ మాత్రం ఆగడం లేదు. టీవీ షోల్లో అలా చిన్న బ్రేక్‌ తీసుకొని వస్తా అన్నట్లుగా..

By అంజి  Published on  21 Oct 2021 2:53 AM GMT
మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు.. అసలు ఆగేది ఉందా? లేదా?

వామ్మో.! పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ఏ మాత్రం ఆగడం లేదు. టీవీ షోల్లో అలా చిన్న బ్రేక్‌ తీసుకొని వస్తా అన్నట్లుగా.. రెండ్రోజులు గ్యాప్‌ ఇస్తూ నాలుగు రోజులు పెరుగుతూ పోతున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఇంధన ధరల పెంపు భారంగా మారుతోంది. తాజాగా చమురు కంపెనీలు మరోసారి ఇంధన ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను పెంచాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.82, లీటర్‌ డీజిల్‌ ధర రూ.103.94గా ఉంది. వరంగల్‌లోని లీటర్‌ పెట్రోల్‌ రూ.110.54గా ఉండగా డీజిల్‌ ధర రూ.103.67కు చేరింది. ఇక కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.95, డీజిల్‌ రూ.104.05కి లభిస్తోంది. నిజామాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.112.51, లీటర్‌ డీజిల్‌ ధర రూ.105.59గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.73, డీజిల్‌ రూ.105.20గా ఉంది. కర్నూలులో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.22 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.104.72కు చేరింది. విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.06, లీటర్‌ డీజిల్‌ ధర 104.55గా ఉంది.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.19, లీటరు డీజిల్‌ ధర రూ.94.92

ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.112.11, లీటరు డీజిల్‌ ధర రూ.102.89

చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71, లీటర్‌ డీజిల్ ధర రూ. 99.68

కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, లీటర్‌ డీజిల్ ధర రూ.98.38

రాజస్థాన్‌లోని గంగానగర్‌లో దేశంలోనే అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.118.23గా, డీజిల్‌ ధర రూ.109.04 గా ఉంది.

Next Story