వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతి రోజు 30పైసలకు పైగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, లీటర్ డీజిల్ పై 38 పైసలను పెంచాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండడంతో సామాన్యుడి నడ్డీ విరుగుతోంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 23 తేదీల మధ్య 20 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యుడిపై రూ.5 భారం పడింది. ఇటు డీజిల్ ధరలు కూడా 23 సార్లు పెరిగాయి.
తాజా ఇంధన ధరల పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.113.12, డీజిల్ రూ.104కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24, లీటర్ డీజిల్ రూ.95.97కు లభిస్తోంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.107.78, లీటరు డీజిల్ రూ.99.08 లభిస్తోంది. చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.104.22, లీటరు డీజిల్ రూ.100.25 కు చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.111.55, లీటరు డీజిల్ రూ.104.70కు లభిస్తోంది.