జూన్ 18 వరకు స్కూల్స్ కు సెలవులు

Patna DM orders to shut schools till 18 June due to extreme heat. భారతదేశంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

By Medi Samrat  Published on  12 Jun 2023 3:13 PM IST
జూన్ 18 వరకు స్కూల్స్ కు సెలవులు

భారతదేశంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల సందడి మొదలు కాగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. అయితే బీహార్ రాష్ట్రంలో విపరీతమైన వేడిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. దీంతో జూన్ 12 నుండి జూన్ 18 వరకు.. 12వ తరగతి వరకు స్కూల్స్ ను మూసి వేస్తున్నామని పాట్నా డీఎం తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు. హీట్ వేవ్, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం కోసం స్కూల్ జూన్ 18 వరకు ఉండదని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్ తన సర్క్యులర్ లో పేర్కొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 144 ప్రకారం, పాట్నా జిల్లాలోని అన్ని ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాలల్లో (ప్రీ స్కూల్ మరియు అంగన్‌వాడీ సెంటర్‌తో సహా) 12వ తరగతి వరకు 18 జూన్ 2023 వరకు విద్యా కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఆర్డర్ జూన్ 12, సోమవారం నుండి అమలులోకి వచ్చిందని, 18 జూన్ 2023 ఆదివారం వరకు అమలులో ఉంటుందని తెలిపారు.


Next Story