అదృష్టం అంటే ఇదే.. 15 ఏళ్ల తర్వాత?

Passenger Receive Her Gold Locket After 15 Years. 15 ఏళ్ళ తర్వాత ఒక మహిళా తాను పోగొట్టుకున్న బంగారు లాకెట్ ను నూతన సంవత్సరం లో చేజిక్కిచ్చుకుంది.

By Medi Samrat  Published on  3 Jan 2021 3:59 AM GMT
gold

సాధారణంగా మనకు సంబంధించిన ఏవైనా వస్తువులు దొంగతనం జరిగినప్పుడు, లేదా కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకున్నప్పుడు కొంతకాలం పాటు చాలా బాధ పడతాం. అయితే ఆ వస్తువులు మనకి తిరిగి రావని కొన్నిసార్లు వాటి పై ఆశలు కూడా వదిలేస్తారు. మరికొందరు మాత్రం మన సొమ్ము గట్టిది అయితే తిరిగి మన ఇంటికి చేరుతుందని చెబుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం ఒక రైల్లో పోగొట్టుకున్న తన బంగారపు లాకెట్ తిరిగి తనను చేరింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

మహారాష్ట్రలోని థానేకు చెందిన రేష్మ అనే మహిళ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రైల్లో ప్రయాణిస్తుండగా తన బంగారపు లాకెట్ ను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని రేష్మ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బంగారపు విఘ్నేశ్వరుడి లాకెట్ తను ఎంతో అదృష్టంగా భావించేది. అయితే ఆ లాకెట్ పోగొట్టుకోవడం వల్ల కొద్ది రోజులపాటు రేష్మ ఎంతో బాధపడింది. తరువాత ఆ లాకెట్ విషయాన్ని మరిచి పోయింది.

తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొన్న రేష్మా ఇంటికి అదృష్టం కూడా తలుపు తట్టింది.పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని పదిహేనేళ్ల క్రితం పోగొట్టుకున్న బంగారపు వినాయకుడి లాకెట్ తనకి అందజేశారు. తన ఎంతో అదృష్టంగా భావించే లాకెట్ తిరిగి మరి తనని చేరుకోవడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ ఈ లాకెట్ గురించి ఫిర్యాదు చేయగా సంవత్సరం క్రితమే ఈ కేసును పరిష్కరించాము. కానీ ఫిర్యాదు చేసిన సమయంలో ఆమె తెలిపిన చిరునామాలో ఆమె లేకపోవడంతో ఆమె కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.చివరికి ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ప్రస్తుత అడ్రస్ ను గుర్తించి నూతన సంవత్సరం కానుకగా ఆమెకు ఈ లాకెట్ ను తిరిగి ఇవ్వాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలిపారు. తను ఎంతో అదృష్టంగా భావించే అదృష్టం తిరిగి తన దగ్గరికి వచ్చినందుకు ఎంతో సంబరపడిన రేష్మ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story