మంత్రి అరెస్ట్‌.. 4 సార్లు ఫోన్‌ చేసినా స్పందించని సీఎం

Partha chatterjee dialled mamata banerjee 4 times since arrest. వెస్ట్‌ బెంగాల్‌లో ఉద్యోగాల నియామకాల స్కామ్‌ కేసులో పరిశ్రమల శాఖ

By అంజి  Published on  25 July 2022 3:48 AM GMT
మంత్రి అరెస్ట్‌.. 4 సార్లు ఫోన్‌ చేసినా స్పందించని సీఎం

వెస్ట్‌ బెంగాల్‌లో ఉద్యోగాల నియామకాల స్కామ్‌ కేసులో పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే మంత్రి ఛటర్జీ సీఎం మమతా బెనర్జీకి ఫోన్‌ చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నాలుగుసార్లు డయల్‌ చేసినప్పటికీ Please try after some time అనే సమాధానమే రావడంతో చేసేదేంలేక ఆయన ఈడీ అధికారులతో వెళ్లారు.

ఈడీ అధికారులు ఎవరినైనా అరెస్ట్‌ చేస్తే.. అరెస్ట్ విషయాలను అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తెలియజేస్తారు. అరెస్ట్ విషయం ఎవరికి తెలియజేయాలని మంత్రిని ఈడీ అధికారులు అడగగా.. సీఎం మమతా బెనర్జీకి తెలియజేయాలని మంత్రి ఛటర్జీ చెప్పాడు. దీంతో నిన్న తెల్లవారుజామును 2.31 గంటలకు, 2.33 గంటలకు, 3.37 గంటలకు, ఉదయం 9:35 గంటలకు నాలుగు సార్లు కాల్‌ చేసాడు. కానీ ఏ కాల్‌కు సమాధానం రాలేదు.

పార్థ ఛటర్జీ అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లోని పాఠశాల ఉద్యోగాల కుంభకోణంపై విచారణకు సంబంధించి మంత్రి పార్థ ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ అరెస్టు చేసింది. మాజీ విద్యా మంత్రికి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన కోల్‌కతా నివాసంలో రూ. 21 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పార్థ ఛటర్జీ అరెస్ట్ చేశారు. అర్పితా ముఖర్జీని ఒకరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తరలించారు. ఆమెను సోమవారం పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story