13న ఎంపీ, హీరోయిన్ నిశ్చితార్థం.. సోష‌ల్ మీడియాలో జంట‌కు పేరు కూడా పెట్టారు..!

Parineeti Chopra, Raghav Chadha To Get Engaged On Saturday. గత కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తల్లో నిలుస్తున్న ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాల

By Medi Samrat
Published on : 9 May 2023 5:30 PM IST

13న ఎంపీ, హీరోయిన్ నిశ్చితార్థం.. సోష‌ల్ మీడియాలో జంట‌కు పేరు కూడా పెట్టారు..!

గత కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తల్లో నిలుస్తున్న ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాల నిశ్చితార్థం తేదీ ఖరారైందని నివేదిక‌లు చెబుతున్నాయి. నివేదిక‌ల ప్ర‌కారం.. ఈ నెల 13న వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ధృవీకరించింది. అయితే వారిద్దరినీ గతంలో అడిగినప్పుడల్లా ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. మార్చి నెలలో ఇద్దరూ ఒకే రెస్టారెంట్‌లో కలిసి కనిపించినప్పుడు వారి డేటింగ్ వార్తలు మొదట వెలువడ్డాయి. అప్పటి నుంచి వీరిద్దరూ ఢిల్లీ-ముంబైలో చాలా చోట్ల కలిసి కనిపించారు.

గ‌తంలో ఓ ఛాన‌ల్ రిపోర్టర్ రాఘవ్ చద్దాను పరిణీతి గురించి అడ‌గ‌గా.. మీరు నన్ను 'రాజనీతి' గురించి ప్రశ్నించండి.. 'పరిణీతి' గురించి కాదు అని నవ్వుతూ చెప్పాడు. ఈ కామెంట్స్ చాలా వైర‌ల్ అయ్యాయి. ఈ విష‌య‌మై చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కూడా రాజ్యసభలో రాఘవ్ చద్దాను ఆటపట్టించారు. మరోవైపు గత నెలలో రాఘవ్ చ‌ద్దా, పరిణీతి బంధానికి ఆప్ ఎమ్మెల్యే ఒకరు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో వీరి జోడీకి 'రగ్నీతి' అనే పేరు కూడా వచ్చింది.


Next Story