తీవ్రవాదులతో చేతులు కలిపిన ఖలిస్థానీ ఉగ్రవాది

‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూన్ కశ్మీర్‌ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు.

By Medi Samrat  Published on  23 Dec 2023 7:19 PM IST
తీవ్రవాదులతో చేతులు కలిపిన ఖలిస్థానీ ఉగ్రవాది

‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూన్ కశ్మీర్‌ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. అంతేకాకుండా కొత్తగా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘కశ్మీర్‌-ఖలిస్థాన్‌ రెఫరెండం ఫ్రంట్‌’ అధికార ప్రతినిధిగా తనను తాను ప్రకటించుకొన్నాడు. ఇక నుంచి భారత సైన్యంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించాడు. పూంచ్‌లో భారత ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులకు మద్దతు తెలిపాడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్. జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులతో అనుబంధాన్ని పెంపొందించడానికి కొత్త ఫ్రంట్‌ను ప్రకటించాడు.

భారత సైనికులపై మెరుపుదాడి కశ్మీరీలపై భారతదేశం ఒడిగడుతున్న హింసకు సమాధానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పన్నూన్. హింస ఎప్పుడూ హింసనే పుట్టిస్తుందని ఓ ప్రకటనను కూడా విడుదల చేశాడు. 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (SFJ) ద్వారా ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నట్లే, కశ్మీర్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలని కశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులను కోరుతున్నానని అన్నాడు. కశ్మీర్‌ కోసం కశ్మీరీ పోరాటయోధులు డిమాండ్‌ చేయాలని పిలుపునిచ్చాడు పన్నూన్.

Next Story