ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా..?

Pankaj Tripathi transforms into Atal Bihari Vajpayee for Main Atal Hoon. డిసెంబరు 25న ప్రపంచం భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని జరుపుకుంటోంది.

By Medi Samrat  Published on  25 Dec 2022 8:43 PM IST
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా..?

డిసెంబరు 25న ప్రపంచం భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని జరుపుకుంటోంది. అంతేకాదు త్వ‌ర‌లో ఆయన బయోపిక్ కూడా వస్తోంది. 'మేన్ అటల్ హూన్' చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో మాజీ ప్రధానిగా పంకజ్ త్రిపాఠి ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. మెయిన్ అటల్ హూన్ సినిమా మాజీ ప్రధాని జీవిత ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. పంకజ్ త్రిపాఠి అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషిస్తూ ఉన్నారని మేకర్స్ ప్రకటించినప్పటి నుండి అందరిలోనూ ఒక క్యూరియాసిటీ నెలకొంది. మాజీ ప్రధానిగా పంకజ్ త్రిపాఠిని చూడడంపై ప్రేక్షకులలో ఓ ఉత్కంఠ మొదలైంది. పంకజ్ త్రిపాఠి సరిగ్గా అటల్ బిహారీ వాజ్‌పేయి లాగా కనిపిస్తున్నందున అభిమానుల్లో నిరీక్షణ ముగిసింది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2023లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం సమీర్ సాహిత్యంతో సలీం-సులైమాన్ స్వరపరచగా, మోషన్ వీడియోకి సోనూ నిగమ్ స్వరాలు అందించారు.




Next Story