పహల్గామ్‌లో ఉగ్రకాల్పులపై భారత ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఈ దాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని భారత సైన్యం ఐఈడీతో పేల్చేసింది. బిజ్ బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. స్థానిక ఉగ్రవాదుల నివాసాల్లోనూ ఆర్మీ సోదాలు చేపట్టింది.
కాగా, మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పాశవిక చర్యలో దాయాది పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. అటు పాకిస్థాన్ కూడా భారత్‌పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.