సామాజిక కార్యకర్త శాంతి దేవీ కన్నుమూత.. నివాళులర్పించిన ప్రధాని

Padma Shri Shanti Devi passes away. సామాజిక కార్యకర్త, పద్మశ్రీ శాంతి దేవి కన్నూమూశారు. గత అర్థరాత్రి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గుణుపూర్‌లోని

By అంజి  Published on  17 Jan 2022 6:59 AM GMT
సామాజిక కార్యకర్త శాంతి దేవీ కన్నుమూత.. నివాళులర్పించిన ప్రధాని

సామాజిక కార్యకర్త, పద్మశ్రీ శాంతి దేవి కన్నూమూశారు. గత అర్థరాత్రి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గుణుపూర్‌లోని తన నివాసంలో శాంతి దేవీ (88) కన్నుమూశారు. బాలాసోర్‌ జిల్లాలో 1934 ఏప్రిల్ 18న జన్మించిన శాంతి దేవి.. కోరాపుట్‌లో చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించి, బాలికల సర్వతోముఖాభివృద్ధి కోసం రాయగడలో సేవా సమాజాన్ని స్థాపించింది. 17 ఏళ్ల వయస్సులోనే డాక్టర్‌ రతన్‌ దాస్‌ను ఆమె వివాహం ఆడారు. ఆమె పునరావాసం, అనాథలు, నిరుపేద పిల్లలకు వృత్తి శిక్షణ విద్య కోసం గన్‌పూర్‌లో మరొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక సేవా రంగంలో ఆమె చేసిన విశేష కృషికి దేశం మొత్తం తనకంటూ ప్రత్యేక పరిచయాన్ని ఏర్పరచుకుంది. 1955లో ఆచార్య వినోభా భావేను కలుసుకున్న శాంతి దేవీ.. భూదాన్‌ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారు.

సామాజిక సేవా ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరిగా, ఆమె 2021 సంవత్సరంలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ'తో సత్కరించబడ్డారు. విద్య ద్వారా గిరిజన బాలికల అభ్యున్నతికి శాంతి దేవి తన అమూల్యమైన కృషికి ప్రసిద్ది చెందింది. ఆమె గత గణతంత్ర దినోత్సవం 2021 నాడు పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడిన విషయం తెలిసిందే. పద్మశ్రీతో పాటు జమునాలాల్‌ బజాజ్‌, రాధానాథ్‌ రథ్‌ పీస్‌ అవార్డులను ఆమె అందుకున్నారు. శాంతి దేవీ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. శాంతి దేవీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Next Story