ఆలయంలో కిచిడీ తిన్న.. 20 మంది చిన్నారులకు ఫుడ్ పాయిజన్
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లోని నానానా గ్రామంలోని ఒక దేవాలయంలో జరిగిన మతపరమైన కమ్యూనిటీ విందులో
By అంజి Published on 27 March 2023 12:30 PM ISTఆలయంలో కిచిడీ తిన్న.. 20 మంది చిన్నారులకు ఫుడ్ పాయిజన్
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లోని నానానా గ్రామంలోని ఒక దేవాలయంలో జరిగిన మతపరమైన కమ్యూనిటీ విందులో కొంతమంది పురుషులతో సహా 20 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. రోగులందరినీ బాగ్‌పత్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. కిచ్డీ తిన్న వెంటనే చాలా మంది పిల్లలు స్పృహ కోల్పోయారు. దీంతో పిల్లల బంధువులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరోగ్య శాఖ నుండి అనేక బృందాలు సంఘటనా స్థలానికి వచ్చాయి.
వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రోగులందరి పరిస్థితి మెరుగైంది. జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సిఎంఎస్) ఎస్‌కె చౌదరి మాట్లాడుతూ.. ఆలయంలోని కిచడీ తిని రెండు డజన్ల మంది పేదలు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఇద్దరు ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, వారు అపస్మారక స్థితిలో ఉన్నారని, ఇతర వ్యక్తుల పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. ఒక రోగి తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రి సందర్భంగా ఆలయంలో మతపరమైన కమ్యూనిటీ విందు ఏర్పాటు చేయబడింది. అందులో అందరికీ ఖిచ్డీ వడ్డించారు. ఇరుగుపొరుగు వారు, పిల్లలంతా ఖిచ్డీ తిని అస్వస్థతకు గురయ్యారు.